telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

టీడీపీకి మళ్ళీ గుర్తొచ్చిన .. (జూ.ఎన్టీఆర్)తారక్ .. సామజిక మాధ్యమాలలో వీడియోలు హాల్ చల్..

tdp social media campaign with tarak videos

తారక్ ఇన్నాళ్లకు మళ్లీ టీడీపీ పార్టీకి గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైమ్. కేవలం ఎన్టీఆర్ క్రేజ్ ను మాత్రమే వాడుకొని సైకిల్ గుర్తుకు ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో రెడీ అయిపోయింది. వీళ్లంతా ఏ చెట్టు కొమ్మలో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ తెలుగుదేశం తమ్ముళ్లే. గడిచిన 3 రోజులుగా వీళ్లు చేస్తున్న పని ఒక్కటే. ఎన్టీఆర్ ను ఎవరైతే పొగిడారో వాళ్లందరి క్లిప్పింగులు కట్ చేయడం, చివర్లో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించడం. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ను పొగుడుతూ వందల క్లిప్పింగులు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఈ వీడియో క్లిప్స్ అన్నిటిలో కూడా ఓట్ ఫర్ సైకిల్ అనే క్యాప్షన్ ఆటోమేటిగ్గా కనిపిస్తోంది. మొన్నటివరకు చంద్రబాబుకు ఎన్టీఆర్ వద్దు. కానీ ప్రచారానికి మాత్రం ఎన్టీఆర్ కావాలి. నేరుగా ప్రచారానికి రమ్మని పిలిస్తే ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో చంద్రబాబుకు తెలుసు. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడు. అందుకే ఇలా దొంగచాటుగా ఎన్టీఆర్ క్లిప్పింగులతో ప్రచారం షురూ చేశారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే.. తన క్లిప్పింగులతో టీడీపీ జరుపుతున్న ప్రచారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ బయటకొచ్చి స్టేట్ మెంట్ ఇవ్వలేడు. అలా ప్రకటన ఇస్తే మళ్లీ అదొక వివాదం అవుతుంది. అందుకే ఇవన్నీ తెలిసినా చూసీచూడనట్టు ఊరుకుంటున్నాడు తారక్.

Related posts