telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మిక గుణపాఠం చెప్పడానికే నా జీవితంలోకి వచ్చింది : రక్షిత్ శెట్టి

Rashmika

ఈ ఏడాది మోస్ట్ డిస్కస్డ్ టాపిక్స్‌లో ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు. కన్నడలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘కిరిక్ పార్టీ’లో జంటగా నటించిన రష్మిక మందన, రక్షిత్ శెట్టి నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకే ఇద్దరూ ఒకరికొకరు గుడ్‌బై చెప్పుకున్నారు. తాజాగా రక్షిత్ తన బ్రేకప్ గురించి మీడియాతో పంచుకున్నారు. “రష్మిక నా జీవితంలోకి నాకు గుణపాఠం చెప్పడానికే వచ్చింది. తనే కాదు.. మన జీవితంలోకి కొందరు వ్యక్తులు వస్తున్నారంటే దాని అర్థం మనకు ఏదో నేర్పించి వెళ్తారనే. అలా నా జీవితంలోకి రష్మిక వచ్చింది. నేను కూడా తనకు గుణపాఠం చెప్పడానికే రష్మిక జీవితంలోకి వెళ్లాను. అలా ఇద్దరం ఒకరి నుంచి ఒకరం గుణపాఠాలు నేర్చుకుని ఎవరి దారి వారు చూసుకున్నాం. జీవితం అంటే ఇదే’. రష్మిక పెద్ద పెద్ద కలలు కంటుంది. నాకు తన గతం గురించి తెలుసు. తను ఎందుకు అంత పెద్ద కలలు కంటుందో కూడా తెలుసు. ఈ క్రిస్మస్‌కు సాంటా క్లా్జ్ ఆమె కలలన్నీ నిజం చేస్తాడని ఆశిస్తున్నా. రష్మిక గురించి మీకు మీరే ఏవేవో అనేసుకున్నారు. అందుకు మిమ్మల్ని నేను తప్పుపట్టను. నాకు రష్మిక రెండేళ్ల నుంచి తెలుసు. మీకంటే నాకే బాగా తెలుసు. కాబట్టి అనవసరంగా ఆమెను తప్పుపట్టకండి. తనను ప్రశాంతంగా ఉంచండి” అని అన్నారు. ఓ పక్క రష్మిక తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. మరోపక్క రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Related posts