telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బాలాకోట్ లో … మళ్ళీ తీవ్రవాద శిబిరాలు.. తీరుమార్చుకొని పాక్ .. ప్రభుత్వమే ప్రోత్సహం..

more terrorist camps in balakot

భారత వైమానిక దళం ఎక్కడైతే సర్జికల్ స్ట్రైక్ ను చేపట్టిందో.. అదే చోట మళ్లీ ఉగ్రవాద శిబిరాలు వెలిసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు కీలక సమాచారాన్ని అందజేసినట్లు చెబుతున్నారు. గతంలో కంటే అధికంగా ఉగ్రవాదులు అక్కడ శిక్షణ పొందుతున్నారనే విషయాన్ని ఉంటంకించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమెండోలు, ఐఎస్ఐ ఏజెన్సీల నుంచి ఈ ఉగ్రవాద శిబిరాలకు మద్దతు లభిస్తోందని ఇంటెలిజెన్స్ అధికారులు ధృవీకరించారు. వారి ప్రోత్సాహంతోనే ఉగ్రవాదులు తరచూ సరిహద్దులను దాటుకుని భారత్ మీదికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారని నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ సరిహద్దులతో పాటు గుజరాత్ లోని సర్ క్రీక్ సముద్ర జలాల ద్వారా భారత్ లోకి చొచ్చుకుని రావడానికి ఉగ్రవాదులు ఇదివరకే విఫల ప్రయత్నాలు చేసిన సందర్భాలను అధికారులు ఇందుకు ఉదహరిస్తున్నారు.

భారత్ పై దాడులు చేపట్టేలా ఉగ్రవాదులను వెన్నతట్టి ప్రోత్సహించేలా ప్రవర్తిస్తోందనే విమర్శలు మరోసారి వెల్లువెత్తాయి. జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దులకు అవతల పాకిస్తాన్ భూభాగంలో ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ లో ఉన్న బాలాకోట్ లో జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు మళ్లీ తమ కార్యకలాపాలను ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ సారి ప్రభుత్వమే వాటిని దగ్గరుండి ఏర్పాటు చేయించిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకంటి కంటే కూడా అధిక సంఖ్యలో బాలాకోట్ లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు మనదేశ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖకు అందజేసినట్లు సమాచారం.

Related posts