telugu navyamedia
సినిమా వార్తలు

హీరోతో పెళ్లిపై స్పందించిన హాట్ బ్యూటీ

malaika-arora-khan

“కెవ్వు కేక” అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హాట్ భామ మలైకా అరోరా. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ను ఈనెల 19న ఓ చర్చ్ లో వివాహం చేసుకోబోతోంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ విషయంపై అటు అర్జున్ కపూర్ గానీ, మలైకా కానీ స్పందించలేదు. దానికి తగ్గట్లే ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, సన్నిహితంగా మెలగడంలాంటివి చేస్తూ మీడియా కంట పడేవారు. వీరి ఎఫైర్ పై ఎన్ని వార్తలు వస్తున్నా ఈ జంట మాత్రం సైలెంట్ గానే ఉండడంతో ఆ వార్తలకు ఊతం దొరికినట్లయింది. కొద్దిరోజులుగా ఈ జంట ఏప్రిల్ 18 నుండి 22 మధ్యలో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ఇటీవల మలైకా తన స్నేహితులతో కలిసి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అర్జున్ కూడా వెళ్లి ఆమెతో సమయం గడిపి వచ్చాడు. దీంతో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేసి వచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ మీడియా మలైకాని తన పెళ్లి విషయమై ప్రశ్నించగా స్పందించిన ఆమె అలాంటిదేమీ లేదని, అవన్నీ రూమర్స్ అని తేల్చేసింది. పెళ్లి వార్తలు నిజం కాదని చెప్పింది. కానీ వారి మధ్య బంధం గురించి మాత్రం కామెంట్ చేయలేదు ఈ హాట్ బ్యూటీ.

Related posts