telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లవ్ అనేది ఓ ఫాల్స్ ఎమోషన్… ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పిన ఆర్జీవీ

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేమకు గొప్ప అర్థాన్ని ఇచ్చారు. “నా దృష్టిలో లవ్ అనేది ఓ ఫాల్స్ ఎమోషన్. అమ్మాయిలు అబ్బాయిలు సెక్స్ కోసం పడే బాధలకు లవ్ అనే పేరుపెడతారు. ఇద్దరి మధ్య సెక్స్ అయ్యాక.. లేదంటే పెళ్లి అయ్యాక ఇద్దరి మధ్య అసలు కలర్స్ బయటకు రావడం మొదలు పెడతాయి. లవ్‌లో ఉన్నప్పుడు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారన్నవి బయటకు వస్తాయి. కుక్కలపైనా చిన్న పిల్లలపైనా లవ్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే.. అవి నీకు ఎదురు తిరిగే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆపోజిట్ మైండ్ చాలా స్ట్రాంగ్ అయితే లవ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్లకి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. టేస్ట్‌లు తేడా ఉంటుంది. వాళ్ల మూడ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. చిన్న పిల్లాడిని మనం పిలిచినప్పుడు వాడి డర్టీ లుక్స్ ఇస్తే వాడిపై మనకు ప్రేమ పోతుంది. ఎందుకంటే లవ్ అనేది మనం తీసుకోవడంలో నుంచి వస్తుంది. నువ్వు గొప్ప.. నువ్వు లేకపోతే నేను లేను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే లవ్ ఉంటుంది. కాని ఇలాంటి అభిప్రాయం ఎప్పుడూ ఉండటం అనేది జరగని పని. ‘నువ్వు లేకపోతే నేను.. జీవించలేను అనేది.. వాడు ముద్దు పెట్టుకోకముందు ఆమెతో సెక్స్ చేయకముందు అంటాడేమో కాని.. తరువాత కూడా అదే ఎమోషన్‌తో అంటాడా అంటే నాకు డౌటే. ఇది నేను ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా.. నా మాటలు రిలేషన్ షిప్‌‌లో ఉన్న ప్రతి ఒక్కడికీ అర్థం అవుతుంది” అంటూ ప్రేమకు అర్థం చెప్పారు రామ్ గోపాల్ వర్మ.

Related posts