telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత ట్రెండ్ సెట్టర్… ప్రియమణి ప్రశంసలు

Priyamani

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. పెళ్లి తరువాత కూడా స్టార్ హీరోయిన్ గా ఆమె హవా నడుస్తోంది. ‘జానూ’ సినిమా తరువాత సమంత నటించిన చిత్రాలేవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. తాజాగా అక్కినేని కోడలు సమంతపై హీరోయిన్ ప్రియమణి ప్రశంసలు కురిపించింది. పెళ్లయినప్పటికీ సమంతకు ఫుల్ డిమాండ్ ఉందని, ఎంతోమందికి ఆమె ఆదర్శంగా నిలిచిందని ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. “నిశ్ఛితార్థం అయిందని తెలిస్తేనే ఒకప్పుడు హీరోయిన్‌కు అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మైండ్ సెట్ మారింది. దానికి సమంతే మంచి ఉదాహరణ. పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె తన శరీరాకృతి విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆమె ఫిజిక్ మెయింటెనెన్స్ అద్భుతం. నాకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి, ఓటీటీల నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి” అని ప్రియమణి తెలిపింది.

Related posts