బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. ఎప్పుడు? ఎక్కడ? హోస్ట్ ఎవరనే విషయాలను చెప్పకపోయినప్పటీ బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు వారాల్లో ప్రారంభం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో మొదలైంది. అందులో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అని ప్రచారం జరుగుతుంది. అందులో హీరో తరుణ్ పేరు కూడా ఉంది. అప్పట్లో తన సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు తరుణ్. ఇక తాను బిగ్ బాస్ లోకి వస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగడంతో దానిపై స్పందించాడు. “గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో, కొన్ని దిన పత్రికల్లో నేను బిగ్‌బాస్‌లో పాల్గొంటానని వస్తున్న వార్తలు అవాస్తవం. బిగ్ బాస్‌లో పాల్గొనే ఆలోచన కానీ, ఉద్దేశ్యం కానీ నాకు ఏమాత్రం లేదు. ఎప్పటికీ కలగదు అని ఫైనల్‌గా అందరికీ స్పష్టం చేస్తున్నాను. ఇవి కేవలం వదంతులు మాత్రమే. దయచేసి తప్పుడు వార్తలని ప్రచారం చేయొద్దు” అని తరుణ్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
previous post
next post