telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆలస్యంగా బాలయ్య 106 మూవీ షూటింగ్ ?

NBK

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ మొదలవుతున్నాయి. స్టార్స్‌ అందరూ సెట్స్‌లో జాయిన్‌ అవుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్‌లో బాలకృష్ణ 106వ సినిమా స్టార్ట్‌ అవుతుందని వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం మేరకు షూటింగ్‌ డిసెంబర్‌లో షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తారని అంటున్నారు. కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాతే షూటింగ్‌ మొదలు పెడదామని బాలకృష్ణ అన్నారట. దీంతో షూటింగ్ స్టార్ట్ కావాలంటే డిసెంబర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందేనని టాక్‌ వినిపిస్తోంది.

Related posts