telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

rain hyderabad

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్ల కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.

గడచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలతో పాటు ఏపీలోని ఉబయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కరిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Related posts