telugu navyamedia
సినిమా వార్తలు

మా స్నేహం వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధ్యమైంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ ఆర్ ఆర్‌.. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా.. తారక్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్రలో అలరించనున్నారు. యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌ జనవరి 7 విడుదల కానుంది.

tarak-charan

ఈ క్ర‌మంలోనే ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురూ ఇండియా మొత్తం తిరుగుతూ ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవ‌ల ముంబై, చెన్నై లో విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌, తాజాగా బుధ‌వారం కేరళలో త్రివేండ్రంలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్ర‌మానికి మలయాళ నటుడు టొవినో థామస్‌ (‘మిన్నల్‌ మురళి’ ఫేమ్) ముఖ్య అతిథిగా విచ్చేశారు.

RRR pre release event

ఈ సంద‌ర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..  చలన చిత్ర పరిశ్రమకు తమిళనాడు షెల్టర్‌ ఇస్తే టెక్నాలజీ విషయంలో కేరళ  జన్మనిచ్చింది. “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య అతిధిగా విచ్చేసిన టోవినో బ్రదర్ కి ధ‌న్య‌వాదాలు..

నా మొదటి ఇండస్ట్రీ హిట్ ‘సింహాద్రి’ ఇక్కడ భారీ విజయం అందుకుంది. రాజమౌళి చెప్పినట్టుగా ‘సింహాద్రి’ కొంతభాగం షూటింగ్‌ ఇక్కడే జరిగింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది.

RRR pre release event

ఇక చరణ్ తో నా అనుంబంధం గురించి చెప్పాలంటే.. చరణ్ నాలో సగభాగం.. అది ఎటు సైడ్ అని అడిగితే ఎడమ వైపు భాగం అంటాను.. ఎందుకంటే హార్ట్ అటే ఉంటుంది కాబట్టి. నేనేదో పబ్లిసిటీ స్టంట్ కోసం చెప్పడం లేదు.. దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వల్ల నేనూ చరణ్‌ స్నేహితులం కాలేదు. అంతకు ముందే మేం ఫ్రెండ్స్‌. మా స్నేహం వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధ్యమైంది.200 రోజులు నా సోదరుడి తో గడిపే అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్‌ చెబుతున్నా. మా బంధం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు. మేమెప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తున్నా..ఫ్యాన్స్ మీరుకూడా ప్రార్ధించండి.. మా స్నేహాం ఎప్పటికి ఇలాగే నిలిచి ఉండాలని కోరుకోండి.

RRR Stars Ram Charan And Jr NTR 'unwind' After Rigorous Practice Session |  Watch

అభిమానులు చాలా దూరం నుంచి వ‌చ్చారు.. రామ్ – చరణ్ అభిమానులిద్దరిని కోరుతున్నాను అందరు ఇళ్లకు జాగ్రత్తగా వెళ్ళండి” ..మీరు అంద‌రూ మాకు చాలా ముఖ్యం అని స్పీచ్‌ని ముగించారు ఎన్టీఆర్‌.

Related posts