telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నించారు: కృష్ణంరాజు

krishnam Raju

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బీజేపీ నేత, నటుడు కృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నించారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఈరోజు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు రెండు వారాల ముందు నన్ను కేంద్రం జైలులో పెడుతుందేమో అని చంద్రబాబు అన్నారని కృష్ణంరాజు గుర్తు చేశారు.

అప్పుడు చంద్రబాబు సింపతి కోసం అలా చెప్పినా, ఇప్పుడు అది నిజం కాబోతోందని పేర్కొన్నారు. తప్పు చేసినవాళ్లు జైలుకు వెళ్లక తప్పదని తేల్చిచెప్పారు. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు అని చంద్రబాబును ఉద్దేశించి కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతతో ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Related posts