telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడం తప్పేంకాదు : బోండా ఉమ

tdp bonda uma counter on ycp comments

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇచ్చిన నోటీసులపై టీడీపీ పార్టీ స్పందించింది. ఆ పార్టీ తరఫున సీనియర్‌ నాయకులు బోండా ఉమ రెస్పాండ్‌ అయ్యారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడం తప్పేంకాదని… ఆర్టికల్‌ 73 ప్రకారమే ఎన్నికలకు మేనిఫెస్టో ఇచ్చామని స్పష్టం చేశారు బోండా ఉమ. ఈ మేనిఫెస్టో పై ఎస్‌ఈసీ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏమీ శాశ్వతం కాదని.. జమిలి జరిగితే వైసీపీ ఉండదని పేర్కొన్నారు బోండా ఉమ. ఎన్నికలే వద్దని కోర్టుకు వెళ్లిన వైసీపీ… ఇప్పుడు మేనిఫెస్టోపై ఎలా ప్రశ్నిస్తుంది ? అని నిలదీశారు. మంత్రులు సభా హక్కులపై ప్రివిలేజ్‌ ఇవ్వడం చెల్లుబాటు కాదని బోండా ఉమ చురకలు అంటించారు. కాగా..నిన్న టీడీపీకి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు టిడిపి మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసింది వైసిపి. అయితే.. వైసిపి ఫిర్యాదుపై నోటీసులు జారీ చేసారు నిమ్మగడ్డ నిమ్మగడ్డ. ఫిబ్రవరి రెండో తేదీ లోపు వివరణ ఇవ్వాలని కోరారు నిమ్మగడ్డ. పార్టీలకు రహితంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని… వైసిపి ఫిర్యాదు చేసిందని నోటీసులో పేర్కొన్నారు నిమ్మగడ్డ. వివరణ ఇవ్వని పక్షంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. 

Related posts