telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేషనల్ అవార్డ్ డైరెక్టర్ కు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ?

Rajasekhar

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ‘కల్కి’ చిత్రంతో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తాజాగా నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠ చెప్పిన ఓ కథకు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ కథ రాజశేఖర్‌కి చాలా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ‘కల్కి’ తర్వాత ఆయన కొత్త సినిమా సంగతి ఎటూ తేలకుండా ఉంది. ‘భాయ్’ దర్శకుడు వీరభద్రం చౌదరితో సినిమా అన్నారు. దాని గురించి ఏ అప్ డేట్ లేదు. నిజానికి ఆయన ‘కల్కి’ తర్వాత కన్నడ హిట్ ‘కవులుదారి’ రీమేక్‌లో నటించాల్సింది. కానీ సినిమా అనౌన్స్ చేశాక దాన్నుంచి తప్పుకున్నారు.

Related posts