telugu navyamedia
సినిమా వార్తలు

నాని అంటే సుందరానికీ ట్రైలర్ రిలీజ్

నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అంటే సుందరానికీ. ఈ సినిమాకు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ దర్శక‌త్వం వ‌హించ‌గా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తోంది.

ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన సాంగ్స్‌, పోస్ట‌ర్స్ అందరిని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా గురువారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .

Ante Sundaraniki: Update from 'Ante Sundaraniki' .. The trailer was coming  then .. | Nani nazriya ante sundaraniki movie trailer update - filmyzoo -  Hindisip

ట్రైలర్ విష‌యానికొస్తే.. ‘ఎవరా అమ్మాయి? హిందువులేనా? చెప్పి చావరా? అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. అయితే ఈ దిక్కుమాలిన సోదంతా మొన్న వచ్చిన టీజర్‌లోనే చెప్పావన్న డైలాగ్‌ ఎదురవడంతో సరే, ఇప్పుడొక ఫ్లోలో చెప్తానంటూ తన కథను మొదలుపెట్టాడు నాని.

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Theatrical Trailer  On June 2nd

సుంద‌రానికి ఒకసారి అమెరికా వెళ్లి రావాలని కోరిక‌, ఈ విష‌యాన్ని ఇంట్లో చెబితే వారు ఒప్పుకోక‌పోవ‌డం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అత‌డికి లేడీ ఫోటోగ్రాఫ‌ర్ లీల‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అది కాస్తా ప్రేమ‌గా మారుతుంది.పక్కా బ్రాహ్మణుడైన అతడు క్రైస్తవ అమ్మాయిలీల‌తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.

Nani's 'Ante Sundaraniki' Trailer Glimpse Notches Up The Excitement

సాంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లను నిష్టగా ఆచరించే సుందరం కుటుంబం అతడి వివాహానికి ఒప్పుకుంటుందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

Related posts