telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ కు రెడీ అవుతున్న సూపర్ స్టార్ ?

Rajinikanth

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్, నయనతార, ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగంలో ఆగిపోయింది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ నిలిచి పోవడంతో బడ్జెట్ భారీగా పెరిగి పోతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. రజినీకాంత్ కూడా ఈ ఏడాది షూటింగ్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారని తెలుస్తుంది. దాంతో నవంబర్ లో షూటింగ్ కు వెళ్లేందుకు రజినీకాంత్ ఓకే చెప్పారట. సినిమాను కేవలం 50 మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల సమక్షంలో చిత్రీకరించబోతున్నారట. అది కూడా అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తల మద్య షూటింగ్ చేయబోతున్నారట. నిబంధనలు పాటిస్తూ, తక్కువ మందితో షూటింగ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన ఎవ్వరూ సాహసించడంలేదు. ఈ సంవత్సరం షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వాలని అంతా అనుకుంటున్నారు.

Related posts