telugu navyamedia
సినిమా వార్తలు

‘భవదీయుడు భగత్‌సింగ్’ టైటిల్ ఫస్ట్ లుక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో.. ‘పిఎస్పీకే 28’ వ‌ సినిమాకు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్ బయటికొచ్చింది. టైటిల్ అభిమానుల‌కి పిచ్చిపిచ్చిగా న‌చ్చేసింది. ప‌వ‌న్ స్టైలిష్‌గా బైక్‌పై కూర్చొని.. టీ తాగుతూ చాలా అందంగా క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. దిల్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ట్యాగ్‌లైన్ ఉత్సుకతని రేకెత్తించింది. అభిమానుల అంచనాలను అందుకునేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేయడంలో దర్శకుడు హరీష్ శంకర్ స‌క్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

గతంలో పవర్ స్టార్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘భీంలా నాయక్’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలతో సెట్స్ మీదున్నాయి.

Related posts