ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలో పరమపదించిన పదిమంది మాజీ శాసనసభ్యులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కడపజిల్లా బద్వేలు శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందిన డాక్టర్ దాసరి సుధ చేత శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రమాణస్వీకారం చేయించారు.
సభ ప్రారంభసమయంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. మహిళా సాధికారతపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఒకే రోజు సభ నిర్వహించి కీలకమైన ఆర్డినెన్సులకు ఆమోదించబోతున్నారు.
అసెంబ్లీతోపాటు శాసన మండలిలో ఆర్డినెన్సులు ఆమోదానికి రానున్నాయ. ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులెటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణలు ఆమోదానికి రానున్నాయి.
సునీతతో రోజుకొక మాట మాట్లాడిస్తున్నారు: సీఎం రమేశ్