telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

జులై 6 నుంచి తెలంగాణ ఎంసెట్

exam hall

తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి శనివారం సమీక్ష నిర్వహించారు. యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్‌ను విడుదల చేశారు.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వివరాలు:

-జులై 1న తెలంగాణ పాలీసెట్‌

-జులై 1 నుంచి 3 వరకు తెలంగాణ పీజీ సెట్

-జులై 4న తెలంగాణ ఈసెట్

-జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్

-జులై 10న తెలంగాణ లాసెట్, లాపీజీ సెట్

-జులై 13న తెలంగాణ ఐసెట్, 15న ఎడ్‌సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

Related posts