telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్‌పై భారత్‌ వైఖరిని సమర్ధించిన సౌదీ

saudi released 95 lakhs to hajj yatra disciple

జమ్ము కశ్మీర్‌పై భారత్‌ వైఖరిని సౌదీ అరేబియా సమర్ధించింది. తన ప్రధాన మద్దతుదారుగా భావిస్తున్న సౌదీ నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సౌదీ అత్యంత కీలకమైన కశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌ వెన్నంటి నిలవడం పాక్‌కు మింగుడుపడటం లేదు. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ బుధవారం సమావేశమై జమ్ము కశ్మీర్‌ పరిణామాలను వివరించారు.

దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జమ్ము కశ్మీర్‌కు సంబంధించి భారత్‌ ఇటీవల తీసుకున్న చర్యలు, అక్కడి పరిణామాలపై దోవల్‌ సౌదీ నేతకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. జమ్ము కశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌ చేపట్టిన చర్యలపై ఈ సందర్భంగా సౌదీ నేత సంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్‌పై పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు కశ్మీర్‌ వ్యవహారం భారత అంతర్గత వ్యవహారంగా దోవల్‌ సౌదీ దృష్టికి తీసుకొచ్చారు.

Related posts