telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దానిని ఒప్పుకున్నా ఈర్డగాన్..

ఈ ఏడాది ప్రపంచ దేశాలలో ఎన్నడూ లేని విధంగా వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, చైనా సరిహద్దు విస్తీరణ మొదలైనవి జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని దేశాలలో అధికారులు తమ విధుల నుంచి తప్పుకుంటున్నారు. అలాంటిదే టర్కీలో జరిగింది. టర్కే ఆర్థిక శాఖా మాంత్రి బెరాట్ ఐబైరాక్,  ఇటీవల తాను విధుల నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే దానిని అధికారులు తెలిపారు. అయితే ఈ ఐబైరాక్ ఆ దేశ అధ్యక్షుడు ఈర్డొగాన్ సంబంధీకుడు. అయితే ఐబైరాక్ రాజీనామాను తాను ఒప్పుకుంటున్నాని ఇటీవల ఈర్డగాన్ ప్రకటించారు. అయితే అసలు ఒక మంత్రి ఉన్నపళంగా రాజీనామా ఎందుకు చేస్తున్నాడని ఆ దేశ ప్రజలకు అనుమానం రాకూడదని, దానికి సంబంధించిన వివరాలను ఈర్డగాన్ తెలిపారు. ఐబైరాక్‌కు ఆరోగ్యం సరిగాలేదని, మరీ దెబ్బతిన్న ఆరోగ్య కారణంగానే అతడి రాజీనామా చేశాడని తెలిపారు. అతడు కోలుకోవాలని కోరుకుంటూ ఈర్డగాన్ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుతం అక్కడ కరోనా కారణంగా అతి తక్కువ మరణాలు సంభవించడంలో ఐబైరక్ కృషి కూడా ఉందనడంలో ఆశ్చర్యం లేదు. అయితే మరి టర్కీ దేశ ఆర్థిక మంత్రిగా ఎవరు విధులు అమలు చేస్తారో చూడాలి మరి.

Related posts