telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

2100 ప్రత్యేక బస్సులు.. ప్రతి బస్సులో పోలీస్‌ ఫోర్స్‌!

strike alarm in APSRTC on

తెలంగాణలో ఈనెల 5 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని ఐఏఎస్ అధికారి సునీల్‌కుమార్ తెలిపారు. తాత్కాలికంగా డ్రైవర్లను నియమిస్తున్నామని, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించామన్నారు. అధికారులందరూ అలర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి బస్సులో పోలీస్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగాలపై ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు.

కొత్త రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని సునీల్‌కుమార్ చెప్పారు. ఆర్టీసీ జేఏసీ కమిటీతో మూడురోజులుగా చర్చించామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ చెప్పారు. సమయం ఇవ్వాలని కోరామని, జేఏసీ నేతలు వినడంలేదని ఆయన తెలిపారు.

Related posts