telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

jeevan-reddy

తెలంగాణలో ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటివరకు ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని ప్రభుత్వం నియమించలేదని అన్నారు. ఆర్టీసీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని జీవన్‌ రెడ్డి దుయ్యబట్టారు.

ఎన్నికల సమయంలో రవాణా వ్యవస్థలో ప్రైవేటు వాహనాల సంఖ్యను తగ్గిస్తామని కేసీఆర్‌ చెప్పారని.. కానీ ఈ ఐదేళ్ల కాలంలో ప్రైవేటు వాహనాలు అదనంగా మరో 5 శాతం పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని వివరించారు. నిర్వహణ లోపం, బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాల్సివచ్చిందని జీవన్‌ రెడ్డి విమర్శించారు.

Related posts