అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండటంతో హరియాణాలో ఎన్నికల సందడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ భాజపా నుంచి బరిలో దిగుతారని సమాచారం. హరియాణాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రోహతక్ లేదా సోనేపట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు.
ఈ కుస్తీ యోధుడ్ని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దించాలని భాజపా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు యోగేశ్వర్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలను కలిశారు. అంతేకాకుండా తన పోలీస్ ఉద్యోగానికి కూడా దత్ రాజీనామా చేసినట్టు సమాచారం. 2012 ఒలింపిక్స్‌లో యోగేశ్వర దత్ కాంస్య పతకం సాధించారు. 2013లో ఆయనను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం సాధించి సత్తా చాటారు.
ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ భయపడుతోంది: యనమల