telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ ను ముంచడానికే ఈ పాదయాత్ర…

revanthreddy campaign in huzurnagar

రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకులు తీసుకున్న అప్పులకు వడ్డీల కింద తీసుకుంటున్నారని,  మీరు చెప్పిన పంటనే వేసిన రైతులకు బోనస్ ఇవ్వండని రేవంత్ అన్నారు. బ్రతికుండాలని రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా..రైతు చనిపోతే రైతు భీమా ఇస్తా అనడం సమంజసం కాదని రేవంత్ అన్నారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుప్పగండ్ల లో 400 ఎకరాల గిరిజనుల భూములు తమవారి పేరు మీద బదిలీ చెయించుకున్నారని, తక్షణమే  ఆ భూములు గిరిజనులకు ఇవ్వాలని  లేదంటే..ఆ భూముల దగ్గరకు వెళ్తానని అన్నారు. కందుకూరు, కడ్తాల్ రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని అయన అన్నారు. పల్లి.. బఠాన్లకు భూములు లాక్కొని… ప్రభుత్వం  కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటుందని రేవంత్ అన్నారు. వచ్చే రెండు..మూడేళ్లు కాంగ్రెస్ నినాదం..జై జవాన్..జై కిసాన్ అని,  జైజవాన్ నినాదంతో భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అయన అన్నారు. ఇంటికొకరు బయటకు రండి, లాల్ బహద్దూర్ శాస్త్రి నినాదం..మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చిందని రేవంత్ అన్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిద్దామన్న ఆయన మనకు మనమే దిక్కని అన్నారు. మనకోసం ఎవరూ రారు, యువత ముందుకు రావాలని అన్నారు.

Related posts