telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 నిర్వహణ పై దాదా క్లారిటీ…

దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా తమ ఐపీఎల్ జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదివరకు ఆండ్రూ టై, ఆ తరువాత స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌దీ అదే పరిస్థితి. తాజాగా- ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా స్వదేశానికి తిరుగుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధినేత సౌరభ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2021 నిర్వహణలో ఇప్పటిదాకా ఎలాంటి కీలక మార్పులు చేయదలచుకోలేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవట్లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఈ సీజన్ కొనసాగుతుందని వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నివేదికలను తెప్పించుకుంటున్నామని వివరించారు. కరోనా పరిస్థితులు చేయి దాటిపోయాయని, అయినప్పటికీ- టోర్నమెంట్‌ను కొనసాగించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. క్రికెటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి అనేక చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

Related posts