telugu navyamedia
క్రీడలు

టీమిండియా ఘోర ప‌రాజ‌యం!

టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ, రహానే మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. లార్డ్స్‌ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్ అంతలోనే ఇంగ్లాండ్​తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత క్రికెట్ జట్టు ఘోరంగా విఫలమైంది.

Data check: India’s 78 all out at Leeds is their third lowest Test innings score in England

ఇంగ్లండ్‌ పేసర్లు ధాటికి..మన బ్యాట్స్‌మెన్‌ కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే కుప్పకూలిపోయారు. ముఖ్యంగా గత మ్యాచ్‌ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్‌ టీమిండియా ను దెబ్బకొట్టాడు. అనంతరం వికెట్‌ కోల్పోకుండా మన స్కోరును దాటేసిన ఇంగ్లండ్‌ తొలి రోజును ఘనంగా ముగించింది.

నిజానికి పిచ్‌ బ్యాటింగ్‌కు మరీ అంత కష్టంగా ఏమీలేదని భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడే వ్యాఖ్యాతలన్నారు. తర్వాత క్రీజులో నిలబడితే పరుగులు సాధించవచ్చని ఇంగ్లాండ్‌ ఓపెనర్లు చాటారు. గత రెండు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లాడి గొప్ప ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌.. ఈ ఇన్నింగ్స్‌లో మాత్రం నిరాశపరిచాడు. అండర్సన్‌ లైన్‌లో వేసిన బంతిని ఆడాలని ప్రయత్నించి వికెట్‌కీపర్‌ చేతికి చిక్కాడు.

బుధవారం ఆరంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి టీమ్‌ఇండియా 78 పరుగులకే కుప్పకూలింది. 105 బంతులాడి 19 పరుగులు చేసిన రోహితే టాప్‌స్కోరర్‌. అతనితో పాటు రహానె (18) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రాలే (16) అత్యధికం కావడం గమనార్హం.

Headingley Test: Virat Kohli's men collapse to 78-all out, India's 3rd lowest  Test total vs England - Sports News

అండర్సన్‌(Anderson) (3/6), ఒవర్టన్‌ (3/14) చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ ఆట ముగిసే సమయానికి 120/0తో నిలిచింది. ఓపెనర్లు బర్న్స్‌ (52 బ్యాటింగ్‌), హమీద్‌ (60 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు.

తొలి రోజు భారత్ బ్యాటింగ్‌ను చూస్తే… లార్డ్స్‌లో గెలిచిన జట్టు ఇదేనా అన్న అనుమానం కలగక మానదు. అంత నిర్లక్ష్యం టీమిండియా ఆటతీరులో కనిపించింది. మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది భారత్. 25 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్…30ఓవర్లు కూడా పూర్తవకుండానే సగం వికెట్లు చేజార్చుకుంది.

Pataudi Trophy 2021, 3rd Test: India's 78 all-out headlines Day 1 as  records are scripted

ఐదు ఓవర్లు వ్యవధిలోనే మిగతా ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. ఇదీ భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగిన తీరు. ఓ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క భారత బ్యాట్స్‌మెన్‌ కూడా కనీసం 20 పరుగులు చేయకపోవడం ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. ఏది ఏమైనా భారత్‌ 78 పరుగులకే కుప్పకూలడం ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం.

Related posts