telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

అంతర్జాతీయ రెఫరీగా .. తెలుగు మహిళా మాజీ క్రికెటర్ …

ex women cricketer gs lakshmi as icc referee

అంతర్జాతీయ రెఫరీగా భారతీయ మాజీ మహిళా క్రికెటర్ జీఎస్ లక్ష్మికి ప్రత్యేక గౌరవం లభించింది. ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచ్ రెఫరీల ప్యానల్ లో చోటు సంపాదించారు. ఈ ప్యానల్ లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఘనతను సాధించారు. 1968లో రాజమండ్రిలో ఆమె జన్మించారు. 2008-09 మధ్య కాలంలో దేశీయ మహిళా క్రికెట్లో 51 ఏళ్ల లక్ష్మి రెఫరీగా వ్యవహరించారు. మూడు మహిళా వన్డే మ్యాచ్ లకు, పలు టీ20లకు ఆమె ఐసీసీ అధికారిణిగా సేవలందించారు.

లక్ష్మి మాట్లాడుతూ, ఇటర్నేషనల్ ప్యానల్ లో చోటు దక్కించుకోవడం అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇండియన్ క్రికెటర్ గా, దేశీయ మ్యాచ్ రెఫరీగా తనకు ఎంతో అనుభవం ఉందని తెలిపారు. ఈ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఉపయోగించుకుంటానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

Related posts