telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

క్రికెటర్లకు … పేరంటల్‌ లీవ్స్‌ .. : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు

cricket board australia introducing parental leaves

క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) సెంట్రల్‌ కాంట్రాక్టు ప్లేయర్లు ఇకపై పేరంటల్‌ లీవ్స్‌ తీసుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా మహిళా క్రికెటర్‌ తల్లయితే గరిష్టంగా 12 నెలలు సెలవులో ఉండొచ్చు. కాంట్రాక్టులో భాగంగా ఆమెకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను, వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేస్తారు. ప్రాథమికంగా మహిళా క్రికెటర్లకే ఇవ్వాలనుకున్నప్పటికీ పురుష క్రికెటర్లు తండ్రి అయినా కూడా సెలవులు ఇవ్వాలని సీఏ నిర్ణయించింది. అయితే వీరికి గరిష్టంగా మూడు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు.

ఈ జూలై 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని సీఏ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టు వ్యవధి మేరకు సెలవులు పూర్తయ్యాక గ్యారంటీగా కాంట్రాక్టు పొడిగింపు ఉంటుందని సీఏ భరోసా ఇచ్చింది. చిన్నారుల్ని దత్తత తీసుకున్నా సెలవులు తీసుకోవచ్చని సీఏ తెలిపింది.

Related posts