telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

భవనాలు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ కరోనా పై లేదు…

ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ… ఇంకా మూడేళ్ల పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారని నేను అనుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మ‌రోవైపు.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉంద‌న్నారు విష్ణుకుమార్ రాజు.. భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ, అధికార యంత్రాంగానికి క‌రోనావైర‌స్ నియంత్ర‌పై లేద‌ని ఎద్దేవా చేసిన ఆయ‌న‌.. క‌రోనా సమయంలోవిద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు… ఇక‌, ఏపీలో రాత్రి కర్ఫ్యూ తుగ్లక్ చర్య అంటూ మండిప‌డ్డ విష్ణ‌కుమార్ రాజు.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చేయాల‌న్నారు.. రోగుల మందులపై 3 నెలల పాటు జీఎస్టీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాల‌ని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఈరోజుకు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే.

Related posts