telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అందుకే స్లాట్ బుకింగ్‌ నిలిపివేశాం : రిజిస్ట్రేష‌న్ శాఖ

kcr stand on earlier warning to rtc employees

కొత్తగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌ను నిలిపివేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.. అయితే, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి య‌థావిథిగా రిజిస్ట్రేషన్ల సర్వీసులు అందించ‌నున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది స‌ర్కార్.. స్లాట్ బుకింగ్ అయిన వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు కొన‌సాగుతాయ‌ని.. కానీ, కొత్త‌గా స్లాట్ బుకింగ్ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై రిజిస్ట్రేష‌న్ శాఖ వ‌ర్గాలు మ‌రింత క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాయి.. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆప్షన్ తొలగించడమా..? కొనసాగించాలా..? అనే విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టత ఇచ్చిన త‌ర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతోంది అంటున్నాయి రిజిస్ట్రేష‌న్ శాఖ వ‌ర్గాలు.. ప్రస్తుతం పాత స్లాట్స్ కు రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తాం.. కొత్త స్లాట్స్ బుకింగ్ కావ‌ని.. తాత్కాలికంగా కార్డ్ వెబ్సైట్ లో స్లాట్స్ నిలిపివేసిన‌ట్టు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, హైకోర్టు ఆదేశాల త‌ర్వాత ఇవాళ సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే.. హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీంకోర్టుకు వెళ్దామా? లేక మార్పులు చేద్దామా? అనే అంశం పై ఆయన చర్చించనున్నారు.

Related posts