telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు

తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక్కో బహిరంగ సభకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి జనాలను రప్పించే ప్రయత్నం చేశారు టీడీపీ వారు అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు. పక్క రాష్ట్రంలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. ప్రజల గురించి మాట్లాడే చిత్తశుద్ధి లేదు. తమ బండారం బయట పడుతుందనే అసెంబ్లీకి రాకుండా టీడీపీ పారిపోతోంది. తండ్రి, కొడుకులు 300 కోట్లు విలాసవంతమైన ఇంట్లో కూర్చుని జూమ్ లో మాట్లాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఎందుకు అంత భయపడుతున్నారు… ఒక్క కోవిడ్ కేర్ సెంటర్ కు అయినా వెళ్ళే ధైర్యం ఉందా.. కరోనా సంక్షోభంలో ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న కృషి చంద్రబాబు కంటికి కనిపించదు. మీసాలు మెలేయటం, కాళ్ళు చూపించటం చేసిన రఘురామ కృష్ణంరాజు బాడీ ల్యాంగ్వేజ్ ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు కేసీఆర్ పై 12 కేసులు పెట్టారు. చంద్రబాబు దేశ ద్రోహం అనే మాటే వినలేదంటున్నారు. అప్పుటి వైసీపీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పై కూడా దేశ ద్రోహం కేసు పెట్టారు… అదే కేసుతో బెదిరించి పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం పై కుట్ర పన్నిన రఘురామ కృష్ణంరాజు వెనుక ఉన్న తన పాత్ర బయట పడుతుందనే చంద్రబాబు ఆందోళన అని పేర్కొన్నారు.

Related posts