telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ ప్రజలకు సీఎం జగన్‌ శుభవార్త !

cm Jagan tirumala

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ప్రతి వార్డుకు 2 చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 8వేల ఆటోమేటిక్ ట్రక్కులు కొనుగోలు చేస్తామన్నారు. జులై 8న చెత్త సేకరణ వాహనాల ప్రారంభిస్తామని… చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్, కెమెరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూరల్‌ ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్న సీఎం… జగనన్న కాలనీల్లో రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైన్లు, తాగునీటి సరఫరా, కరెంటు, పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకోసం, మొత్తంగా రూ.30,691 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా చేశారు. దీనిపై సమీక్ష అనంతరమే విశాఖలోని ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్‌ ద్వారా విశాఖకు తరలింపుపై సమీక్షలో కీలక చర్చ జరిగింది.

గోదావరి జలాలను విశాఖకు పైపులైన్‌ ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలపై ప్రస్తావించారు. రానున్న 30 ఏళ్లకాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలుండాలని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్, అంశాలనూ హై ప్రయార్టీగా తీసుకోవాలన్న సీఎం జగన్… విశాఖ నుంచి భీమిలి వరకూ బీచ్‌రోడ్డు విస్తరణ, భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్‌ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి భోగాపురం వరకూ మెట్రోను ప్రతిపాదించారు. కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేయగా… ట్రాం సర్వీసులకు మరో రూ.6వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేయాలన్న సీఎం జగన్‌… భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిక చేపట్టాలని సీఎం ఆదేశించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టునూ ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలన్నారు సీఎం జగన్…

Related posts