telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉంజా పట్టణంలో ఓటు వేసిన మోదీ భార్య

Modi wife vote in Unja gujarat

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మూడో విడుత పోరుకు ఓటింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు , 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ లోని ఉంజా పట్టణంలో ఆమె ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం కోసం మోదీ ఎంతో చేశారని, మరెంతో చేయబోతున్నారని చెప్పారు. గాంధీనగర్ జిల్లాలో మోదీ తల్లి హీరాబెన్ మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజారాత్ లో ఈరోజు మొత్తం 26 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

వీటితో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు 37.94 శాతంగా పోలింగ్ నమోదైంది. అస్సాం 28.64 శాతం, బీహార్ 25.65 శాతం, గోవా 28.49 శాతం, గుజరాత్ 24.93 శాతం, జమ్ము కశ్మీర్ 4.72 శాతం, కర్నాటక 21.05 శాతం, కేరళ 25.79 శాతం, మహారాష్ట్ర 17.26 శాతం, ఓడిశా 18.58 శాతం, త్రిపుర 29.21 శాతం, ఉత్తరప్రదేశ్ 22.39 శాతం, పశ్చిపబెంగాల్ 35.00 శాతం, ఛత్తీస్‌గఢ్ 27.29 శాతం, దాద్రా నగర్ హవేలి 21.62 శాతం, డయ్యు డామన్ 23.93 శాతం పోలింగ్ నమోదైంది.

Related posts