telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్ ఖాతాలో పింక్ టెస్ట్…

cricket team australia

అడిలైడ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆతిధ్య జట్టు అయిన ఆసీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆ తర్వాత ఆసీస్ ను 191 పరుగులకే కట్టడి చేసింది. దాంతో 53 పరుగుల ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది టీం ఇండియా. కానీ ఆసీస్ బౌలర్లు కమిన్స్, హాజిల్ వుడ్ తమ బంతులతో చెలరేగిపోవడంతో భారత్ 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో షమీ రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. అక్కడితో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కు 53 పరుగుల ఆధిక్యం ఉండటంతో ఆసీస్ లక్ష్యం 90 పరుగులకు నిర్ధేశించబడింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఆసీస్ మొదటి నుండి చాల ప్రశాంతగా ఆడుతూ వచ్చింది. ఆ జట్టు ఓపెనర్లు జో బర్న్స్, మాథ్యూ వేడ్ ఇద్దరు మొదటి వికెట్ కు 70 పరుగులు జోడించారు. కానీ వేడ్ (33) రన్ ఔట్ కాగా ఆ తర్వాత వచ్చిన మార్నస్ లాబుస్చాగ్నే(6) ను అశ్విన్ పెవిలియన్ కు చేర్చాడు. కానీ చివరికి మరో ఓపెనర్ బర్న్స్ (51) అర్ధశతకం పూర్తి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో నాలుగు టెస్ట్ ల ఈ సిరీస్ లో 1-0 ఆతిధ్య జట్టు ఆధిక్యంలోకి వెళ్ళింది. చూడాలి మరి తర్వాత మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

Related posts