telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జగిత్యాల జిల్లాలో ఒక్కే రోజు 409 కేసులు…

corona

జగిత్యాల, జిల్లాలో కరోనా పాజి టివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి శనివారం జిల్లావ్యాప్తంగా 1350 మందికి పరీక్షలు నిర్వహించగా 409 మందికి పాజిటివ్ గా తేలింది. మెట్పల్లిలో 100 వంద మందికి మల్యాలలో 67 మందికి పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ లోనూ 43 మందికి పాజిటివ్ గా తేలింది

మల్లాపూర్: మండల కేంద్రంలో శనివారం 102 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 26 మందికి పాజి టివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధి కారి రాకేష్ తెలిపారు. ఇందులో మల్లాపూర్-6, కుస్తాపూర్-4, కొత్తదాం రాజుపల్లి-4, చిట్టాపూర్-2, సిరిపూర్-1, రాఘవ పేట-1, గుండంపల్లి-1, గొర్రెపల్లి-1, మెట్పల్లి మండలం వెంపేట-3, ఇబ్రహీంపట్నం-3 చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు

మెట్ పల్లి గ్రామీణం: మండలంలోని కొండ్రికర్ల గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం 36 కరోనా పాజి టివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామంలో ఇప్ప టికే స్వచ్చంద భాక్డౌన్ అమలు చేస్తున్నారు. కోనరావు పేటలో పది హేను రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానం

చేశారుమల్యాల: మండలంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. శనివారం మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తూర్పువాడ ఎస్సీ కాలనీలో 241 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 67 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. మూడురోజుల్లో 589 మందిని పరీక్షించగా 210 మందికి వైరస్ సోకినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు

రాయికల్: మండలంలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి కట్కాపూర్, అల్లీపూర్ గ్రామాల్లో కరోనా నివారణకు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తుండగా రాయికల్ పట్టణంలో శనివారం 12 కేసులు నమోదు కావడంతో పట్టణంలో కేసులు 20 దాటాయి

ధర్మపురి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శని వారం 14 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 101 మందిని పరీక్షించగా 14 మందికి పాజిటివ్ గా నమోదైనట్లు తెలిపారు

Related posts