telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ సోయం తీవ్ర వ్యాఖ్యలు!

soyam bapu rao

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. “కేసీఆర్ ఓ పిచ్చికుక్క” అని అన్నారు. తులసి వనంలో గంజాయిమొక్కలా తయారయ్యాదని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యాలు చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను ఎవరూ నమ్మొద్దని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపైనా ఆయన విమర్శలు చేశారు. బీజేపీని ఎలా నిరోధించాలన్న దానిపైనే రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించారని అన్నారు.

Related posts