telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ ఆటగాడి పై గంభీర్ ప్రశంసలు…‌

ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్‌ బట్లర్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్‌ టీ20 బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌లలో బట్లర్ ఒకడని పేర్కొన్నాడు. ‘జోస్‌ బట్లర్ ఆట అద్భుతం. అతడు అసాధారణ ఆటగాడు. నాకు తెలిసి రోహిత్‌ శర్మతో పాటు వరల్డ్‌ టీ20 బెస్ట్‌ బ్యాటర్లలో బట్లర్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని నా అభిప్రాయం. ఫాస్ట్‌ బౌలర్లు అయినా, స్పిన్నర్లు అయినా తను వెనక్కి తగ్గడు. తను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం ఏ బౌలర్‌ తరం కాదు’ అని అన్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్, హార్దిక్ పాండ్యా ‌ వంటి బౌలర్లకు జోస్ బట్లర్‌ను ఆపడం చాలా కష్టం’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లాండ్-భరత్ మధ్య నేడు నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ను మట్టికరిపిస్తేనే భారత్ సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే మూడో టీ20లో ఓడి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది.

Related posts