telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆర్మీ కి .. కొత్త చీఫ్ .. యోచనలో కేంద్రం..

army chief ravath checking in LOC

కేంద్రం ప్రస్తుత ఆర్మీ అధిపతి బిపిన్‌ రావత్‌ స్థానంలో కొత్త చీఫ్‌ను నియామకం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. భారత సైనికాధిపతిగా ఆర్మీ చీఫ్‌గా బిపిన్‌ రావత్ మూడు సంవత్సరాల కాల వ్యవధి ఈ ఏడాది డిసెంబర్‌ 31న ముగియనుండటంతో కొత్త అధిపతి నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. 1.2 మిలియన్‌ సైనికులున్న ఈ దళాధిపతి స్థానానికి అందరి కన్నా సీనియర్‌ జనరల్‌ను నియమించనున్నారు.

ప్రస్తుత ఆర్మీ వైస్‌ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎంఎన్‌ నర్వానే, ఉత్తర, దక్షిణ ఆర్మీ కమాండర్‌ల లెఫ్టినెంట్ జనరల్స్‌ రణ్‌బీర్‌ సింగ్‌, సతీందర్‌ కుమార్‌ సైనీల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నియామక ప్రక్రియ రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ప్రారంభమైనప్పటికీ.. నియామకంపై తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్‌ కమిటీ తీసుకుంటుంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒక్కరే ఉన్నారు. అదే విధంగా దేశ భద్రతా విభాగంలో కలిసి పనిచేస్తున్నందున జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబాల్‌ సైతం ఈ సభ్యుల నియామకంలో కీలక పాత్ర పోషిస్తారు.

Related posts