యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఇటలీలోని అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఇప్పటికే ఇటలీలో షూటింగ్ లొకేషన్ నుంచి పూజాహెగ్డే ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకోగా వైరల్ అయింది. ఇటీవలే ఇటలీ షూట్ షెడ్యూల్ పూర్తయినా ప్రభాస్ అక్కడే ఉన్నాడు. షూటింగ్ షెడ్యూల్ పూర్తయి విరామం దొరకడంతో రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ ఇటలీలోని టురిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. థిక్ బ్లూ కలర్ ప్యాంట్, తెలుపు రంగు మ్యాచింగ్ టీషర్టు, క్యాప్ విత్ జెర్కిన్ ధరించి టురిన్ వీధుల్లో తిరిగాడు. రోడ్డు వెంబడి వెళ్తుండగా కాస్త పొట్టిగా బ్లూ జెర్కిన్ వేసుకున్న ఓ వ్యక్తితో కలిసి సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ కెమెరాకు ఫోజులిచ్చాడు యంగ్ రెబల్ స్టార్. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రభాస్ వచ్చే వారం హైదరాబాద్ కు వచ్చి, రాధేశ్యామ్ తర్వాతి షెడ్యూల్ లో పాల్గొననున్నట్టు సమాచారం. నెల రోజుల అనంతరం షూటింగ్ పూర్తవడంతో ఇటీవల ఈ సినిమా యూనిట్ భారత్ కు వచ్చింది.
previous post
అసభ్యంగా తాకేవాళ్ళు ఎక్కువవుతున్నారు… ఆ తేడాగాళ్లను ముందే పసిగట్టాలి : రకుల్