telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టైగర్ ష్రాఫ్ న్యూ లుక్… సిక్స్ ప్యాక్ కాదు… ఏకంగా టెన్ ప్యాక్..!!

Tiger

బాలీవుడ్‌ హీరో, జాకీష్రాఫ్‌ కుమారుడు టైగర్‌ష్రాఫ్‌ శరీరసౌష్టవానికి టైగర్‌ మొదటి ప్రాధాన్యతనిస్తాడు. తాజాగా టైగర్ ష్రాఫ్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. కండలు తిరిగిన దేహంతో కన్పిస్తున్న ఈ యంగ్ హీరో లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మాములుగా సిక్స్ ప్యాక్ కోసమే హీరోలు నానా తంటాలు పడుతుంటారు. కానీ టైగర్ మాత్రం ఈ లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగించుకుని ఏకంగా 10 ప్యాక్ సంపాదించేశాడు. టైగర్ ష్రాఫ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైగర్‌ ష్రాఫ్‌ అసలు పేరు జై హేమంత్‌ ష్రాఫ్‌. 28 సంవత్సారాలుంటాయి ఈ కండల వీరుడికి. టైగర్‌ ఫస్ట్‌ సినిమా హీరో పంత్‌. ఆ తరువాత బాగీ, బాగీ2, వార్‌, బాగీ3 సినిమాలు తీశాడు. వార్‌ సినిమా తప్ప మీగతా మూడు యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే.

Related posts