టాలీవుడ్ లో యంగ్ హీరోల పెళ్లి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే యంగ్ హీరో నిఖిల్ పెళ్ళి చేసుకోగా, మరో హీరో నితిన్ పెళ్లిపీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు “ఆమె ఎస్ చెప్పింది” అంటూ రానా షాక్ ఇచ్చేశాడు. త్వరలోనే రానా, మిహికాల జంట కూడా పెళ్ళి పీటలెక్కబోతోంది. అయితే ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు తన పిల్లల పెళ్ళి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నిహారిక, వరుణ్ తేజ్‌ల పెళ్లి త్వరలోనే చేస్తానని చెప్పుకొచ్చారు. నాగబాబు చెప్పిన విషయాన్ని పలు వెబ్ సైట్స్ జోరుగా ప్రచారం చేశాయి. అంతేకాదు వరుణ్ త్వరలోనే ఓ బిజినెస్ మెన్ కూతురిని పెళ్లాడబోతున్నాడని, పెళ్ళి విషయమై నాగబాబు, వరుణ్ లకు మధ్య గొడవ జరిగినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా సాయిధరమ్ తేజ్ వరుణ్ తేజ్‌ని “ఏంటి బావ ? నీకు పెళ్లంటా” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసి సంగీత దర్శకుడు థమన్ “నిజమా?” అని ప్రశ్నించాడు. సాయితేజ్ ట్వీట్ కు స్పందించిన వరుణ్ “దానికి చాలా టైం ఉందిలే… కానీ మన రానా దగ్గుబాటి, నితిన్ మాత్రం ఫరెవర్ విత్ యూ అంటూనే సింపుల్ గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు” అంటూ సమాధానమిచ్చాడు.
Enti bava @IAmVarunTej neeku pellanta? 😱😱😱 pic.twitter.com/0jEWbDe5PU
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 23, 2020