telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు : ఎక్కడ ఏ పార్టీ లీడ్ లో ఉందంటే ?

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ 209, స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, భాజపా 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వామపక్ష కూటమి కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఇక తమిళనాడులో ఏడీఎంకే 97, డీఎంకే 136 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రభావం చూపిస్తుందనుకున్న కమల్‌హాసన్‌ పార్టీ ఎంఎన్‌ఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక కేరళ విషయానికొస్తే ఎల్‌డీఎఫ్‌ 89, యూడీఎఫ్‌ 44, భాజపా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అస్సాంలో భాజపా 79, కాంగ్రెస్‌ 45, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, పుదుచ్చేరిలో భాజపా 12, కాంగ్రెస్‌ 3, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Related posts