telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాస్ ఏంజిల్స్‌ లో కార్చిచ్చు… ఆందోళనలో హాలీవుడ్ స్టార్స్

Fire

హాలీవుడ్ స్టార్స్‌, సెల‌బ్రిటీలు ఉండే అత్యంత సంప‌న్న ప్రాంతం బ్రెంట్‌వుడ్ స‌హా ప‌లు శివారు ప్రాంతాల్లో దావాగ్ని వ్యాపించింది. కాలిఫోర్నియా అడ‌వుల్లో మొద‌లైన కార్చిచ్చు క్ర‌మంగా లాస్ ఏంజిల్స్‌ను తాకింది. అర్ధ‌రాత్రి మంట‌లు ఎగిసిప‌డ‌టంతో సెల‌బ్రిటీలు భ‌యంతో ఇళ్ల నుండి ప‌రుగులు తీశారు. ఈ ప్ర‌మాదంలో మిలియ‌న్ డాల‌ర్ల విలువ చేసే ఐదు ఇళ్లు ద‌గ్ధ‌మైన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ కార్చిచ్చు కార‌ణంగా ఆర్నాల్డ్ కొత్త సినిమా `ట‌ర్మినేట‌ర్ డార్క్ ఫేట్‌` ప్రీమియ‌ర్ షోను ర‌ద్దు చేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క చర్య‌ల‌ను చేప‌ట్టారు. మంట‌ల‌ను అదుపు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Related posts