telugu navyamedia
సినిమా వార్తలు

దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన భారతీరాజా

Bharathiraja

గత నెల ఫిలిం మేక‌ర్ కె. భార‌తీ రాజా త‌మిళ సినీ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. క‌మ‌ల థియేట‌ర్‌లో జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌ర‌గ‌గా, అందులో సంఘం నాయ‌కులు భార‌తీరాజాని ఎక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘానికి ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా విక్ర‌మ‌న్, కార్య‌ద‌ర్శిగా ఆర్‌కే సెల్వ‌మ‌ణి, కోశాధికారిగ పేరర‌సు బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తిస్తున్నారు. దర్శకుడు విక్రమన్‌ ఆరు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగడంతో ఈ సారి తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. దీంతో భార‌తీ రాజాని త‌మిళ సినీ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడిగా కార్య‌వ‌ర్గం ఎంపిక చేసింది. తాజాగా భారతీ రాజా దర్శకుల సంఘం అధ్యక్ష పదవికి సోమవారం రాజీ నామా చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. గత నెల తమిళ దర్శకు ల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించి సంఘఅధ్యక్షునిగా భారతీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సమా వేశంలో దర్శకులు, సహాయ దర్శకులు మద్దతుతో తనను ఏకగ్రీవంగా అధ్యక్ష పదవి కి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని, అయితే ఎన్నిక లు లేకుండా ఒక పదవికి ఎంపిక కావడం వల్ల వచ్చే చిక్కులు తనకు తెలుసని పేర్కొన్నారు. అందువల్ల ప్రజాస్వామ్య పద్ధతి లో అధ్యక్షుడి ఎంపిక కోసం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు, దర్శకుల సంఘ అభివృద్ధికి తన తోడ్పాటు ఎల్లప్పుడు ఉంటుందని భారతీ రాజా తెలిపారు. జూలై 14న దర్శకుల సంఘం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భారతీరాజా రాజీనామా చేయడం గమనార్హం.

Related posts