telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ రాఘవన్ గా వస్తున్న విజయ్ ఆంటోని…

తమిళ్ హీరో విజయ్ ఆంటోని చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రజలకు సుపరిచితమయ్యాడు.  బిచ్చగాడు సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ తమిళ నటుడు భేతాళుడుతో మార్కెట్ పెంచుకున్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నా… బిచ్చగాడు మినహా మిగతా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.  దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  ఈ క్రమంలో విజయ్ ఆంటోని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోడియిల్ ఒరువన్’ ని కూడా తెలుగు ఆడియన్స్ కి అందించనున్నారు. ‘మెట్రో’ ఫేమ్ ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో ”విజయ రాఘవన్” పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ తో విజయ్ ఆంటోని ఆకట్టుకుంటున్నాడు. బిల్డింగ్స్ పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు గాంధీ ఫోటోలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏమేర అభిమానులను మెప్పిస్తుందా… అనేది చూడాలి.

Related posts