telugu navyamedia
సినిమా వార్తలు

నాగ చైతన్య “లవ్ స్టోరీ “.. షాకింగ్ న్యూస్ ..

అక్కినేని నాగ చైతన్య నటించిన ” లవ్ స్టోరీ ” ఈ నెల 24న విడుదలవుతుంది . ఈ సినిమాకు దీనికి అనూహ్యమైన నేపథ్యం కలసి వచ్చింది .నాగ చైతన్య కు ఇద్దరు తాతలు . ఒకరు అక్కినేని నాగేశ్వర రావు . నాగేశ్వర రావు కుమారుడు నాగార్జున మొదటి భార్య కుమారుడు నాగ చైతన్య. మరో తాత దగ్గుబాటి రామానాయుడు . రామానాయుడు కుమార్తె లక్ష్మి కుమారుడు నాగ చైతన్య .

ఈ ఇద్దరు తాతలు కలసి రూపొందించిన సినిమా ”ప్రేమనగర్ ” . ఈ సినిమాకు దర్శకుడు కె .ఎస్ . ప్రకాష్ రావు . సంగీతం కె .వి .మహదేవన్ . ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావుకు జంటగా వాణిశ్రీ నటించింది . ఇందులో పాటలే కాదు , మాటలు కూడా ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి .

అంతకు ముందు నిర్మాత రామానాయుడు నిర్మించిన సినిమాలు అంతగా ఆడలేదు . రామనాయుడును ఆర్ధికంగా దెబ్బతీశాయి . కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల అందరికీ నచ్చడంతో సినిమాగా తీద్దామనుకున్నారు . అయితే గతంలో తీసిన సినిమాలతో పోల్చితే ఇది భారీ బడ్జెట్ తో తీయవలసిన సినిమా . అప్పటికే అప్పులతో సతమతమవుతున్న రామానాయుడు ధైర్యం చేసి నిర్మాణం మొదలు పెట్టాడు .

Prema Nagar Telugu Movie Scene HD || ANR || Vanisri || Suresh Productions - YouTube

ఈ సినిమా విజయం సాధిస్తే సినిమా రంగంలో కొనసాగటం లేదా కారంచేడు వెళ్లి వ్యయసాయం చేసుకోవడం . తన జీవితానికి ఈ సినిమా పెద్ద అగ్ని పరీక్ష . అయినా భారమంతా తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి మీద వేసి సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు . నాగేశ్వర రావు, వాణిశ్రీ తో పాటు మిగతా అందరూ ఖరీదైన నటీనటులే. దీనికి డ్ తోడు భారీ సెట్స్ . డబ్బు నీళ్లలాగా ఖర్చయి పోతోంది . రామానాయుడు ఆశావాది, అందుకే సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు .

ఈ అవాంతరాలు లేకుండా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు . ప్రేమ నగర్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు . కలెక్షన్స్ జడివానలా కురిశాయి .దేవదాసు సినిమా తరువాత అక్కినేని నాగేశ్వర రావు కు ప్రేమనగర్ లో ధరించిన కళ్యాణ్ పాత్ర ఎంతో పేరు సంపాదించి పెట్టింది . ప్రేమ నగర్ సినిమాతో రామానాయుడు దశా , దిశా రెండు మారిపోయాయి . ఈ సినిమా కొన్ని థియేటర్ లలో 750 రోజులు ఆడింది . రామానాయుడు తమిళంలో శివాజీ గణేశంతో “వసంత మాళిగై ” , హిందీ లో రాజేష్ ఖన్నా తో “ప్రేమ్ నగర్ ‘ పేరుతో నిర్మించి ఘన విజయం సాధించారు .

ఇక నాగ చైతన్య , సాయి పల్లవితో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ డోస్ , రామ్మోహన్ రావు నిర్మించారు . శేఖర్ కమ్ముల సినిమా అనగానే భారీ అంచనా ఉంటుంది . ఈ సినిమాకు ఏ .ఆర్ . రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతాన్ని సమకూర్చాడు . ఈ సినిమాలో ” సారంగ దరియా ‘ అన్న పాటను యు ట్యూబ్ లో ఇప్పటి వరకు 32 కోట్ల మంది చూశారు . ఇది అతి పెద్ద రికార్డు .

Saranga Dariya' to 'Vachinde': Sai Pallavi's Telugu dances you should watch | The News Minuteఈ సినిమా నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యింది . కరోనా, లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది . ఇటీవల థియేటర్ లు తెరిచినా ప్రేక్షకులు కరోనా భయంతో పెద్దగా రావడం లేదనే ఉద్దేశ్యం తో చాలామంది ఓ .టి .టి లకు వెళ్లిపోతున్నారు .


కానీ ఈ చిత్ర నిర్మాతలు , దర్శకుడు మాత్రం థియేటర్ల లోనే విడుదల చెయ్యాలనే సంకల్పంతో విడుదలను అనేక పర్యాయాలు వాయిదా వేశారు . చివరికి “లవ్ స్టోరీ ” సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది . ఈనెల అంటే సెప్టెంబర్ 24న ప్రపంచమంతా “లవ్ స్టోరీ ” విడుదలవుతుంది .

Naga Chaitanya-Sai Pallavi's 'Love Story' is soothing and heartbreaking too, teaser outఆనాటి ‘ప్రేమ నగర్ ” సినిమాకు ,ఈనాటి “లవ్ స్టోరీ ” సినిమాకు లింక్ ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదూ ?
“ప్రేమ నగర్ ” సినిమా సెప్టెంబర్ 24, 1971న విడుదలైంది .

అంటే ఆ సినిమా విడుదలై 50 సంవత్సరాల తరువాత ఇద్దరు తాతల ముద్దుల మనవడు చైతు నటించిన “లవ్ స్టోరీ ” విడుదలవుతుంది .ఇది నిజంగా అనూహ్యం , అపూర్వమైన విషయం .” ప్రేమనగర్ ” సినిమా మ్యాజిక్ “లవ్ స్టోరీ ” విషయంలో రిపీట్ అవుతుందా ? నాగ చైతన్య మాత్రం చాలా నమ్మకంగా వున్నాడు . చూద్దాం !
-భగీరథ

Related posts