telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రమ్యకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్

Ramyakrishna

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తన అందంతో, అభినయంతో ఇప్పటికీ మంచి అవకాశాలతో దూసుకెళ్తోంది. ఒకప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోలందరితోనూ నటించి అగ్ర కథానాయికగా వెలుగొందిన ఈ బ్యూటీ క్యారెక్టర్ రోల్స్‌కు మారిన తర్వాత కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇటీవల `బాహుబలి`తో ఉత్తరాదిన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక రమ్యకృష్ణ, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్… అందరిని షాక్ కు గురి చేస్తూ ఈ ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరవాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు రమ్యకృష్ణ. ఇటీవల తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో నటించి అబ్బురపరిచింది. సోగ్గాడే చిన్నినాయనా, క్వీన్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. గతంలో భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చంద్రలేఖ’, ‘శ్రీ ఆంజనేయం’ సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ చాలా ఏళ్ళ తర్వాత ‘రంగమార్తాండ’లో నటిస్తోంది. ఇక నేడు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి ఆమె బర్త్ డేని సెలెబ్రేట్ చేశారు కృష్ణ వంశీ. దీనికి సంబంధించిన ఫోటోలను రమ్యకృష్ణ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts