telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియా విషకన్య… కాంట్రాక్ట్ కిల్లర్… జేడీయూ నేత తీవ్ర వ్యాఖ్యలు

Sushanth

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యపై పలువురు ప్రముఖులు అనుమానాలను వ్యక్తం చేశారు. సుశాంత్‌ ఆత్మహత్యపై అతడి తండ్రి కేకే సింగ్‌ పాట్నాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నటి రియా సహా ఆరు మందిపై ఆయన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను విచారించేందుకు బీహార్ పోలీసులు ముంబైకి వెళ్లారు. తాజాగా జేడీయూ నేత మహేశ్వర్ హజారీ మాట్లాడుతూ రియా చక్రవర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ను హత్య చేశారని, దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రియా ఒక కాంట్రాక్ట్ కిల్లర్ గా వ్యవహరించిందని, ప్రేమ పేరుతో సుశాంత్ ను మోసం చేసిందని, డబ్బు తీసుకుని వెళ్లిపోయిందని, ఆమె ఒక విషకన్య అని అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే సుశాంత్ వద్దకు రియాను పంపించారని ఈ కోణంలో విచారణ జరగాలని అన్నారు. సుశాంత్ కేసును ముంబై పోలీసులు సరిగా విచారించడం లేదని, ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ జరగాలని మహేశ్వర్ డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి బీహార్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తుందని చెప్పారు. సుశాంత్ కు న్యాయం జరగాలని సీఎం నితీశ్ కుమార్ కూడా కోరుకుంటున్నారని తెలిపారు.

Related posts