telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

టిక్ టాక్ స్థానాన్ని ఆక్రమించనున్న “హైస్టార్” హైదరాబాద్ యాప్

Hystar

టిక్‌టాక్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్‌ టిక్‌టాక్‌ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో.. నగరానికి చెందిన పబ్బాస్‌ గ్రూప్‌.. హైస్టార్‌ అనే ఓ యాప్‌ను విడుదల చేసింది. గతంలో కొన్ని యాప్స్‌ 15 సెకన్ల నిడివి కలిగిన వీడియో మాత్రమే చేసుకునే అవకాశం ఇచ్చేవని, తమ యాప్‌లో ఒక నిమిషం వరకూ వీడియోలు చేసుకోవచ్చని హైస్టార్‌ యాప్‌ సీఈఓ స్వామి ముద్దం చెప్పారు. డైలాగ్స్‌, కామెడీ, గేమింగ్‌, ఫుడ్‌, స్పోర్ట్స్‌, మీమ్స్‌… ఇలా విభిన్న అంశాల్లో వీడియోలు చేసి ప్రదర్శించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన వారికి పలు కంపెనీల ప్రకటనల్లో నటించే అవకాశం సైతం కల్పిస్తున్నామన్నారు. తద్వారా పేరు ప్రతిష్టలతో పాటుగా సంపాదనా ఉంటుందని పేర్కొన్నారు.

Related posts