telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన జగన్

cm jagan ycp

మహిళల సాధికారిత కోసం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడత సాయంగా బటన్‌ నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లోకి రూ.18,750 చొప్పున పంపారు.

45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున అందించే ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.4,700 కోట్లను కేటాయించింది. ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతారు. మహిళల స్వాలంభన కోసం ఇప్పటికే ప్రభుత్వం అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్ వంటి పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

Related posts